సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ ఎదుట హజరుకానున్న ఎమ్మెల్యే గాంధీ
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:50 AM
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ ఖాతా నుంచి ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాలకు రూ.2.1కోట్లు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నగదు లావాదేవీలు వెనుక ఉన్న కారణాలపై ఈడీ ఆరా తీయనుంది. అందుకోసం ఈ రోజు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఫ్లాట్లు, విల్లాలు నిర్మించి ఇస్తామంటూ ఫ్రీ లాంచ్ ఆపర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో సాహితీ ఇన్‌ఫ్రా నగదు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం నగదును ఆ సంస్థ పక్కదారి పట్టించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సాహితీ ఇన్‌ఫ్రా సంస్థపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. దాంతో పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సాహితీ ఇన్‌ఫ్రా ఫ్రీ లాంచ్ పేరుతో ప్రజల నుంచి రూ.258 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. కానీ ఈ కేసు దర్యాప్తులో ఆధారాలతో రూ.842 కోట్లు మేర మోసం జరిగినట్లు గుర్తించారు. ఈ సంస్థ ఎండీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ సంస్థ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. ఆ సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్‌చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. భారీగా ఈవ్‌టీజర్ల అరెస్ట్
బసిరెడ్డిపల్లి గోశాలలో ఆవులపై పెద్దపులి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు
For More TG News And Telugu News