Share News

కేటీఆర్‌కు షోకాజ్‌ నోటీసుపై స్టేటస్ కో

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:57 AM

ఫార్ములా-ఈ రేసు కేసు నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ ఎందుకు జప్తు చేయరాదో వివరణ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (ఆర్‌పీవో) ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై హైకోర్టు స్టేటస్‌కో (యథాతథ స్థితి) విధించింది.

కేటీఆర్‌కు షోకాజ్‌ నోటీసుపై స్టేటస్ కో
Telangana High Court

  • పాస్‌పోర్టు సీజ్‌ అంశంలో హైకోర్టు నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ రేసు కేసు నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ ఎందుకు జప్తు చేయరాదో వివరణ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (ఆర్‌పీవో) ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై హైకోర్టు స్టేటస్‌కో (యథాతథ స్థితి) విధించింది. ఆర్‌పీవోకు ఏ నిబంధన కింద కేసు సమాచారాన్ని ఇచ్చిందో వెల్లడించాలని ఏసీబీని ఆదేశించింది. గతనెల 28న పాస్‌పోర్టు చట్టం సెక్షన్‌ 10(3)(ఈ) కింద కేటీఆర్‌కు ఆర్‌పీవో నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆధా రాలను పరిశీలించామని, కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ జప్తు చేయాల్సి ఉంటుందని ఈనెల 13న ఆర్‌పీవో ప్రొసీ డింగ్స్‌ జారీచేశారు. దీనితో కేటీఆర్‌ సదరు షోకాజ్‌ నోటీసు, ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం మంగళవారం విచార ణ చేపట్టింది. కేటీఆర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌ క్రమం తప్పకుండా ఏసీబీ కోర్టు ఎదుట హాజరవు తున్నారని వివరించారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. కేసు నుంచి విముక్తి కల్పించాలని డిశ్చార్జి పిటిషన్‌ సైతం దాఖలు చేసినట్లు తెలిపారు. కానీ ఏసీబీ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకముందే.. ఈ కేసు గురించి రీజనల్‌ పాస్‌పోర్ట్‌ అధికారికి, ఏసీబీకి సమాచారం ఇవ్వడం అక్రమమని ధర్మాసనా నికి విన్నవించారు. ఏ నిబంధన కింద ఆర్‌పీవోకు ఏసీబీ సమాచారం ఇచ్చిందో తెలియదని.. ఇదంతా కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ను జప్తు చేయించడానికి కుట్ర అని ఆరోపించారు.


షోకాజ్‌ నోటీసుపై వ్యక్తిగతంగా వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని ఆర్‌పీవోను కేటీఆర్‌ కోరారని.. కానీ ఆయన వాదన వినకముందే అక్టోబరు 13న పాస్‌పోర్ట్‌ జప్తు చేయాల్సి ఉంటుందం టూ ఆర్‌పీవో లేఖ రాశారని వివరించారు. దీనిపై రీజినల్‌ పాస్‌పోర్టు అధికారి తరఫున అదనపు సొలి సిటర్‌ జనరల్‌ నర్సింహశర్మ వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ను జప్తు చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలివ్వలేదని ధర్మాసనానికి వివరించా రు. వ్యక్తిగత వాదన వినాలన్న నిబంధనేదీ లేకపో యినా.. కేటీఆర్‌ వ్యక్తిగత వాదన వినిపించడానికి అ వకాశం ఇచ్చామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఏసీబీకి పలు ప్రశ్నలు సంధించింది.


కేసులో చార్జిషీట్‌ దాఖలుతో ఏసీబీ బాధ్యత ము గిసిపోయి.. కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు పర్యవేక్షి స్తోంది. కేసు గురించి ఆర్‌పీవోకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?’’ అని నిలదీసింది. ఏసీ బీ వివరణ ఇవ్వకపోవడంతో కేటీఆర్‌కు ఆర్‌పీవో ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై స్టేటస్‌కో విధిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని విదేశాంగశాఖ, రీజినల్‌ పాస్‌ పోర్ట్‌ ఆఫీసర్‌, ఏసీబీ డీజీలకు నోటీసులు జారీ చేసిం ది. విచారణను నవంబరు 6కు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

యాదాద్రి రెండో దశకు ఒడిసా, బెంగాల్‌ల బొగ్గు

అమీర్‌పేటలో 32 మీటర్లు!

అస్తిత్వానికి ఉస్మా‘నయా’ రూపం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 05:57 AM