అమీర్‌పేటలో 32 మీటర్లు!
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:52 AM
రాష్ట్రవ్యాప్తంగా 324 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు ఉన్నాయని, అత్యంత లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయని తెలంగాణ భూగర్భ జల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
రాష్ట్రంలో అత్యంత లోతుకు భూగర్భ జలాలు
324 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు
రంగారెడ్డి, వరంగల్, ములుగు, మేడ్చల్ జిల్లాల్లో తీవ్రం
ప్రభుత్వానికి భూగర్భ జల శాఖ నివేదిక
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 324 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు ఉన్నాయని, అత్యంత లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయని తెలంగాణ భూగర్భ జల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో 621 మండలాలు ఉండగా.. సగానికిపైగా మండలాల్లో భూ ఉపరితలం నుంచి అత్యంత లోతుల్లో భూగర్భ జలాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతానికి 52 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, 272 మండలాల్లో మధ్యస్తంగా ఉందని వివరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, ములుగు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నారాయణపేట్, న ల్గొండ, మహబూబాబాద్, కామారెడ్డి, గద్వాల, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. రాష్ట్రంలో 2025 సెప్టెంబరులో భూ ఉపరితలం నుంచి సరాసరిగా 3.11 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా... ఈ ఏడాది సెప్టెంబరులో 7.52 మీటర్ల లోతులో గుర్తించామని వెల్లడించింది.
రాజధానిలో డేంజర్ బెల్స్
హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు అత్యంత లోతులో గుర్తించారు. అమీర్‌పేట మండ లంలో 32.07 మీటర్లు; బాచుపల్లిలో 29.99 మీటర్లు; సికింద్రాబాద్‌లో 19.74 మీటర్లు; కూకట్‌పల్లిలో 18.16 మీటర్లు; కుత్బుల్లాపూర్‌లో 17.77 మీటర్లు; వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 17.38 మీటర్లు; మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో 16.89 మీటర్లు; బాలానగర్‌లో 15.7 మీటర్లు; సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువులో 14.75 మీటర్లు; పెద్దేముల్‌లో 14.08 మీటర్లు; పాలకీడు మండలంలో 12.48 మీటర్లు; మఠంపల్లిలో 9.71 మీటర్ల లోతులో ఉన్నాయని గుర్తించింది.
అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలోని బండ్లగూడలో 13.26 మీటర్లు; గోల్కొండలో 11.5 మీటర్లు; ఖైరతాబాద్‌లో 11.92 మీటర్లు, బహదూర్‌పురాలో 9.57 మీటర్లు; అంబర్‌పేటలో 9.54 మీటర్లు; సైదాబాద్‌లో 9 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. గోదావరి ఒడ్డునే ఉండే భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాచలం మండలంలో 6.14 మీటర్లు; లక్ష్మీదేవీపల్లి మండలంలో 8.9 మీటర్లు; భూపాలపల్లి జిల్లాలోని ఘన్‌పూర్ (ములుగు)లో 7.9 మీటర్లు; భూపాలపల్లి మండలంలో 9.01 మీటర్లు; కృష్ణా నదికి పక్కనే ఉన్న గద్వాల జిల్లా అలంపూర్‌లో 8.41 మీటర్లు; ఉండవెల్లిలో 13.88 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
యాదాద్రి రెండో దశకు ఒడిసా, బెంగాల్‌ల బొగ్గు
ఎల్‌నినోపై నేడు అఖిలపక్ష సమావేశం
అస్తిత్వానికి ఉస్మా‘నయా’ రూపం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News