Share News

ఎల్‌నినోపై నేడు అఖిలపక్ష సమావేశం

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:36 AM

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

ఎల్‌నినోపై నేడు అఖిలపక్ష సమావేశం
Telangana El Nino All Party Meeting

  • క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ భట్టి అధ్యక్షతన భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం, ఎల్‌నినోపై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు.


తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్తు సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి కీలక అంశాలపై అఖిలపక్ష నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. కరువు నివారణకు అనుసరించాల్సిన వ్యూహాలు, అవసరమైన ముందస్తు చర్యలపై అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఈ సమావేశంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. ఈమేరకు మంత్రులకు సమాచారం అందించాల్సిందిగా వారి ఓఎ్‌సడీలకు రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ లేఖలు పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై సీఎం మౌనం వీడాలి

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!

నేడు రాష్ట్రంలో వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 05:36 AM