Share News

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై సీఎం మౌనం వీడాలి

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:30 AM

జవహర్‌ నగర్‌ కాలుష్యంపై సీఎం రేవంత్‌రెడ్డి నాడు ఎంతో ఉద్యమం చేసి నేడు మౌనం వహించడం తగదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై సీఎం మౌనం వీడాలి
Jawaharnagar dumping yard protes

  • కాలుష్యం పేదల ప్రాణాలను హరిస్తున్నా పట్టదా?..

  • విష రసాయనాలతో అనేక రకాల వ్యాధులు

  • పర్యావరణం పూర్తిగా నాశనం

  • నాడు ఉద్యమం చేసి నేడు మౌనమా?

  • మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆగ్రహం

  • యార్డును తరలించాలంటూ పాదయాత్ర ప్రారంభం

  • పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

ఘట్‌కేసర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : జవహర్‌ నగర్‌ కాలుష్యంపై సీఎం రేవంత్‌రెడ్డి నాడు ఎంతో ఉద్యమం చేసి నేడు మౌనం వహించడం తగదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డును ఎత్తివేయాలని మంగళవారం మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా ఎదులాబాద్‌ నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు విష రసాయనాలతో అనేక రకాల వ్యాధులు సోకుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డు కారణంగా పర్యావరణం పూర్తిగా దెబ్బతింటున్నదన్నారు.

రూ.వేల కోట్లు వెచ్చించి మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేవలం రెండు మూడు వందల కోట్లతో పరిష్కారం అయ్యే జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యను విస్మరించడం తగదన్నారు. ప్రశ్నించే గొంతుకను కాపాడుకోవాలనే నినాదంతో ప్రజల్లోకి వచ్చిన ఆయన వారికి ఎంతో మేలు చేస్తాడని ఆశించినట్లు గుర్తు చేశారు. పాదయాత్రలో భాగంగా ఘట్‌కేసర్‌ డివిజన్‌ పరిధిలోని బొక్కోనిగూడ వద్ద వరి ధాన్యం ఎండబోసిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎరిమల్లెవాగులో కలుస్తున్న కాలుష్య జలాలతో ధాన్యం రంగు మారుతున్నదని, దీంతో అధికారులు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు ఎంపీకి మొర పెట్టుకున్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : రాంచందర్‌ రావు

జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డును ఎత్తివేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ చేపట్టిన పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు పాల్గొని మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డు కాలుష్యం నివారణపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని ఆరోపించారు. గతంలో ఎదులాబాద్‌ లక్ష్మినారాయణ చెరువు నీటిని ప్రజలు తాగేవారని గుర్తుచేశారు. నాటి చెరువులు, కుంటలు, వాగులు, కాల్వలు నేడు పూర్తిగా విషతుల్యమై ఎందుకూ పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరిగిపోతున్న జల, వాయు కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వచ్చే నెల రెండున కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చి ట్యాంక్‌బండ్‌ వద్ద జరిగే పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

జయేశ్‌ వీఆర్‌ఎస్‌!

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!

నేడు రాష్ట్రంలో వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 05:30 AM