Share News

రేవంత్‌రెడ్డి.. రెన్యువల్‌ సీఎం: కేటీఆర్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:20 AM

రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని, రెన్యువల్‌ సీఎం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

రేవంత్‌రెడ్డి.. రెన్యువల్‌ సీఎం: కేటీఆర్‌
KTR

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని, రెన్యువల్‌ సీఎం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఢిల్లీలో ఈఎంఐ కడితేనే ముఖ్యమంత్రి పదవి మళ్లీ రెన్యువల్‌ అవుతుందని, రైతులకు రైతుబంధు పడకపోయినా.. రాహుల్‌ బంధు మాత్రం సమయానికి అందుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బీఆర్‌ఎ్‌సలో చేరారు.


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితేనే.. తెలంగాణ గట్టెక్కుతుందని, అభివృద్ధి బాటలో నడుస్తుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సను బలోపేతం కోసం నవంబరు 11న నిర్మల్‌లో భారీ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:20 AM