రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ అక్రమాలు: కేటీఆర్
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:10 AM
బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్-2 టెండర్లలో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్-2 టెండర్లలో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ పనులను ప్యాకేజీలుగా విభజించి, తమకు నచ్చిన సంస్థలకు పనులు అప్పగించేందుకు ఇతర బిడ్డర్లను అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వ నిర్ణయాలతో రూ.600కోట్ల మేర ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. తన వ్యవసాయ భూమిని కాపాడుకునేందుకు కార్యాలయానికి వచ్చిన రైతును గజ్వేల్ తహసీల్దార్ అవమానించిన తీరు సిగ్గుచేటని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రపతితో భేటీ తర్వాతా.. రాహుల్ పచ్చి అబద్ధాలు చెప్పారు
మెట్రో దిగగానే పాడ్ ట్యాక్సీ!
‘హ్యాండ్, ఫుట్, మౌత్’ డిసీజ్ పంజా
Read Latest AP News And Telangana News And International News And Telugu News