Share News

రాష్ట్రపతితో భేటీ తర్వాతా.. రాహుల్‌ పచ్చి అబద్ధాలు చెప్పారు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:07 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ తర్వాత కూడా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు మండిపడ్డారు.

రాష్ట్రపతితో భేటీ తర్వాతా.. రాహుల్‌ పచ్చి అబద్ధాలు చెప్పారు
Ramchander Rao

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపాటు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ తర్వాత కూడా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు మండిపడ్డారు. ‘ఓట్‌ చోరీకి సంబంధించి రాష్ట్రపతి ఆధారాలు అడిగారని రాహుల్‌గాంఽధీ స్వయంగా ప్రకటించారు. చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో ఆయన ఇవ్వలేకపోయారు.. అయినా, ఓట్‌చోరీని రాష్ట్రపతి అంగీకరించారంటూ రాహుల్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారు.


ఇది కాంగ్రెస్‌ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని ఆయన విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దమ్ముంటే తొలగించిన ఓటర్ల పేర్లు వెల్లడించాలని సీఎం రేవంత్‌కు, రాహుల్‌కు సవాల్‌ చేశారు. తెలంగాణలో ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘కోడ్‌’ కూయక ముందే బదిలీలు?
మెట్రో దిగగానే పాడ్‌ ట్యాక్సీ!
‘హ్యాండ్‌, ఫుట్‌, మౌత్‌’ డిసీజ్‌ పంజా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 06:07 AM