Share News

‘కోడ్‌’ కూయక ముందే బదిలీలు?

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:47 AM

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్‌ నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వరుసగా జరిగే అవకాశం ఉంది.

‘కోడ్‌’ కూయక ముందే బదిలీలు?
Telangana IAS IPS Transfers

  • త్వరలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మార్పులు

  • స్థానిక ఎన్నికల ముందు భారీ కసరత్తు

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్‌ నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వరుసగా జరిగే అవకాశం ఉంది. కోడ్‌ అమల్లోకి వస్తే బదిలీలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో ఒకేచోట దీర్ఘకాలంగా ఉన్న అధికారులను ముందుగానే మార్చాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిఘా వర్గాల నుంచి ఇప్పటికే నివేదికలను తెప్పించకున్నట్లు సమాచారం.


అధికారులపై కాంగ్రెస్‌ నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నారు. వివిధ జిల్లాల్లో రెండేళ్లుగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సి ఉండటం, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తుండడంతో అనుకూలురు, సమర్థులైన అధికారులను కీలక స్థానాల్లో నియమించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎస్పీలతోపాటు ఒకరిద్దరు పోలీసు కమిషనర్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది.


హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కా జిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్లలో డీసీపీ స్థాయి అధికారుల్లోనూ మార్పులు ఉండొచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన టీజీ-టీమార్స్‌కు అధికారులను నియమించాల్సి ఉంది. అలాగే, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఈగల్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోల్లోనూ మార్పులు జరగొచ్చని తెలుస్తోంది. ఈ సారి బదిలీల్లో అధికారుల పనితీరుకు సీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరోవైపు కొందరు అధికారుల మీద జరుగుతున్న దుష్ప్రచారం వెనుక పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఉన్నారన్న నివేదికలు సీఎం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

వాతావరణ మార్పులతో ప్రమాదంలో ప్రజారోగ్యం

ఎక్సైజ్‌ శాఖకు మళ్లీ ఆయుధాలు

నువ్వు బతికే ఉన్నావా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 05:47 AM