Share News

ఎక్సైజ్‌ శాఖకు మళ్లీ ఆయుధాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:35 AM

రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి స్మగ్లర్ల ఆగడాలు పెరుగుతుండటం, ఎక్సైజ్‌ సిబ్బందిపై దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ శాఖకు మళ్లీ ఆయుధాలు కేటాయించే దిశగా కీలక అడుగు పడింది.

ఎక్సైజ్‌ శాఖకు మళ్లీ ఆయుధాలు
Telangana Excise Department

  • ప్రతిపాదనలు పంపేందుకు రంగం సిద్ధం

  • గతంలో నక్సల్స్‌ భయంతో వెనక్కి ఇచ్చిన అధికారులు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి స్మగ్లర్ల ఆగడాలు పెరుగుతుండటం, ఎక్సైజ్‌ సిబ్బందిపై దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ శాఖకు మళ్లీ ఆయుధాలు కేటాయించే దిశగా కీలక అడుగు పడింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఏడాది క్రితం ఎక్సైజ్‌ సిబ్బందికి ఆయుధాలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానిపై సమగ్ర ప్రతిపాదనలు పంపేందుకు రంగం సిద్థమయింది. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ క్యూర్‌ పరిధిలోని ఆ శాఖ అధికారులతో ఈ విషయంపై సమీక్షాసమావేశం నిర్వహించారు.


ప్రభుత్వం ఆయుధాలు కేటాయించడానికి అంగీకరిస్తే.. ఏ స్థాయి అధికారులకు ఇవ్వాలనే దానిపై అభిప్రాయాలు సేకరించారు. గతంలో నక్సల్స్‌ ప్రభావం ఉన్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎక్సైజ్‌ సీఐ స్థాయి అధికారుల వద్ద ఉన్న ఆయుధాలను వారే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెనక్కి అప్పగించారు. కాలక్రమేణా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం డ్రగ్స్‌, నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ గంజాయి అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోవడం, స్మగ్లర్లు ఎక్సైజ్‌ సిబ్బందిపై దాడులకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


ఇటీవలే నిజామాబాద్‌లో తనిఖీల సమయంలో అక్రమార్కులు మహిళా కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సిబ్బంది ఆత్మరక్షణకు, విధుల్లో భద్రతకు ఆయుధాలు తప్పనిసరి అనే అభిప్రాయం బలపడింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పోలీస్‌ శాఖతో పూర్తి సమన్వయంతో వెళ్లాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.


బార్లు, మద్యం షాపుల ఎక్సైజ్‌ రెంటల్‌ ఫీజుల వసూలు, కొత్త బార్ల దరఖాస్తుదారులకు గైడెన్స్‌ వంటి పరిపాలనాంశాలపై కూడా చర్చించారు. అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాషిన్‌ ఖురేషి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ అంజన్‌రావుతో పాటు పలువురు అధికారులు సమావేశంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాతావరణ మార్పులతో ప్రమాదంలో ప్రజారోగ్యం

మంత్రాల నెపంతో తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కొడుకు

విద్యా వ్యాపారం వల్లే పేదరికం
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 05:35 AM