Share News

మంత్రాల నెపంతో తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కొడుకు

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:14 AM

గ్రామంలో మరణాలకు తన తల్లి చేసిన మంత్రాలే కారణమని నమ్మిన ఆమె తనయుడు... ఆమెను అంతం చేస్తేనే మరణాలు ఆగుతాయన్న ఆలోచనతో పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశాడు.

మంత్రాల నెపంతో తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కొడుకు
Superstition Crime

  • అక్కడికక్కడే మృతి.. నిందితుడి అరెస్టు

టేక్మాల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో మరణాలకు తన తల్లి చేసిన మంత్రాలే కారణమని నమ్మిన ఆమె తనయుడు... ఆమెను అంతం చేస్తేనే మరణాలు ఆగుతాయన్న ఆలోచనతో పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశాడు. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం ఎల్లుపేటలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రె సాయవ్వ(40) కూలి చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించగా, కుమారుడు దుర్గేశ్‌ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు.


దుర్గేశ్‌.. కొన్నాళ్లుగా స్వగ్రామానికి వచ్చి ఉంటున్నాడు. తల్లి సాయవ్వ మంత్రాలు చేయడం వల్లే ఇటీవల గ్రామంలో కొందరు చనిపోయారని అనుమానించిన దుర్గేశ్‌.. రెండు రోజుల క్రితం ఆమెతో గొడవ పడ్డాడు. గ్రామంలో శుక్రవారం పెద్ద మనుషుల పంచాయితీ పెట్టి.. ఇదే విషయం చెప్పాడు. దీంతో పెద్దలు సైతం అతడిని మందలించారు. శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చిన దుర్గేశ్‌.. సాయవ్వపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘పాలమూరు-రంగారెడ్డి’లో మరో ముందడుగు

వేయిస్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ

అదిరిపోయే డిజైన్‌తో చిలకపచ్చ చీర!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 05:14 AM