‘పాలమూరు-రంగారెడ్డి’లో మరో ముందడుగు
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:58 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరొక ముందడుగు పడనున్నది. ఈనెల 12వ తేదీన ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులోని రెండు శక్తివంతమైన మోటార్ల ద్వారా నీటి పంపింగ్‌ను ప్రారంభించనున్నారు.
12న పంపింగ్ ప్రారంభించనున్న మంత్రి జూపల్లి
కొల్లాపూర్/మెండోరా, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరొక ముందడుగు పడనున్నది. ఈనెల 12వ తేదీన ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులోని రెండు శక్తివంతమైన మోటార్ల ద్వారా నీటి పంపింగ్‌ను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు.
ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ లాల్ సింగ్ తెలిపారు. కాకతీయ ఆయకట్టు ఎల్‌ఎండీ వరకు నీటిని విడుదల చేస్తున్నామని, ఎల్‌నినో ప్రభావంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తగినంత నీటినిల్వ లేదని, విడుదల చేసిన ప్రతీ నీటి చుక్కని రైతుల పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, అలీసాగర్‌కు 540 క్యూసెక్కులు, గుత్పకు 405 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 285 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎంగిలిపూల గౌరమ్మ వెలిసెనమ్మో మా వాడలోన..
వేయిస్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ
అదిరిపోయే డిజైన్‌తో చిలకపచ్చ చీర!
Read Latest AP News And Telangana News And International News And Telugu News