Share News

అదిరిపోయే డిజైన్‌తో చిలకపచ్చ చీర!

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:53 AM

రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత ఏడాది కేవలం మహిళా సంఘాల్లోని సభ్యులకు మాత్రమే చీరలు పంపిణీ చేసిన సర్కారు..

అదిరిపోయే డిజైన్‌తో చిలకపచ్చ చీర!
Sircilla Green Sarees

  • రాష్ట్రంలోని మహిళల కోసం కోటి చీరల తయారీ

రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత ఏడాది కేవలం మహిళా సంఘాల్లోని సభ్యులకు మాత్రమే చీరలు పంపిణీ చేసిన సర్కారు.. ఈ సారి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది 6.50 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి సర్కారు ఆర్డరు ఇవ్వగా.. ఇప్పటికే 4.50 కోట్ల మీటర్ల ఉత్పత్తిని సిరిసిల్ల నేత కార్మికులు పూర్తి చేశారు.


మరో పది రోజుల్లో ఉత్పత్తి పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. చిలకపచ్చ రంగులో ఆకర్షణీయమైన డిజైన్లతో దాదాపుగా కోటి చీరలను సిద్ధం చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ పండుగకు కానీ లేదంటే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా(నవంబరు 19న) కానీ చీరలు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

- ఆంధజ్యోతి, సిరిసిల్ల


ఈ వార్తలు కూడా చదవండి:

ఎంగిలిపూల గౌరమ్మ వెలిసెనమ్మో మా వాడలోన..
వేయిస్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ

అలైన్‌మెంట్‌ తకరారు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:53 AM