వేయిస్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:47 AM
బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా జరిగాయి.
హనుమకొండ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా జరిగాయి. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. 50వేల మందికిపైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మను ఆడారు. ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపం ప్రాంతం, గుడి బయట గార్డెన్ కూడా మహిళలతో కిక్కిరిసిపోయింది.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నీలిమారెడ్డి దంపతులు బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. రాధేశ్యాం సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పాటల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రధానం చేశారు. వేయిస్తంబాలగుడి ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ఈవో డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎంగిలిపూల గౌరమ్మ వెలిసెనమ్మో మా వాడలోన..
ఎంఎస్‌ఎంఈల కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’
అలైన్‌మెంట్ తకరారు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News