Share News

ఎంఎస్‌ఎంఈల కోసం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:42 AM

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎ్‌సఎంఈ) మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

ఎంఎస్‌ఎంఈల కోసం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’
Sridhar Babu

  • సమస్యల పరిష్కారానికి నెలకోసారి గ్రీవెన్స్‌ డే: శ్రీధర్‌ బాబు

  • వికసిత్‌ భారత్‌ సాధనలో కీలకపాత్ర: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా ‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ’ బ్రాండ్‌ విశ్వవ్యాప్తమయ్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవకాశాలు, పెట్టుబడుల అనుసంధానం తదితర అంశాల్లో ఎంఎ్‌సఎంఈలకు మార్గనిర్దేశం చేస్తామన్నారు. లఘు ఉద్యోగ్‌ భారతి(తెలంగాణ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో శనివారం నిర్వహించిన ‘ఎల్‌ యూబీ ఎంఎ్‌సఎంఈ సౌత్‌ ఇండియా సమ్మిట్‌’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎంఎస్‌ఎంఈలు లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎంఎ్‌సఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. క్షేత్రస్థాయిలో ఇవి ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక పరిష్కారాలు చూపించేందుకు నెలకోసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఎంఎ్‌సఎంఈ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.


2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో ఎంఎ్‌సఎంఈలది కీలక పాత్ర అని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఎంఎ్‌సఎంఈలు కేవలం చిన్న పరిశ్రమలు కాదు.. దేశ పారిశ్రామిక రంగానికి బలమైన స్తంభాలు. ఉద్యోగ కల్పనలో, 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా రూపుదిద్దడంలో ఎంఎ్‌సఎంఈ రంగం కీలకమైన ఇంజన్‌గా వ్యవహరించనుంది. పెద్దపెద్ద పరిశ్రమల ద్వారానే దేశ అభివృద్థి సాధ్యం కాదు.. గ్రామాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ఎంఎ్‌సఎంఈలు పనిచేేస్తనే సాధ్యమవుతుంది.’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎంగిలిపూల గౌరమ్మ వెలిసెనమ్మో మా వాడలోన..
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌

అలైన్‌మెంట్‌ తకరారు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:42 AM