Share News

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:26 AM

సర్‌ను రద్దు చేసి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలో మహాధర్నా చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ బయలుదేరివెళ్లనున్నారు.

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌
Revanth Reddy

  • ఇండియా కూటమి మహా ధర్నాలో పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రులు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): సర్‌ను రద్దు చేసి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలో మహాధర్నా చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ బయలుదేరివెళ్లనున్నారు. ఇందులో సీఎంతోపాటు మంత్రులందరూ భాగస్వాములు కానున్నారు. ఎల్‌నినోపై 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంటుందని తొలుత నిర్ణయించినా.. దీన్ని వాయిదావేశారు.


ఢిల్లీ నుంచి సీఎం, మంత్రులు తిరిగొచ్చిన తర్వాతే ఎల్‌నినోపై క్యాబినెట్‌ సమావేశం జరగనుంది. కాగా, మహాధర్నా నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఢిల్లీకి తరలిరావాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులందరూ ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికల్లా ఢిల్లీ చేరుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ కోరారు. దీన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పంటలు వేయొద్దు
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

హైస్పీడ్‌ రైళ్ల అలైన్‌మెంట్‌ ఖరారు కాలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:26 AM