Share News

విద్యా వ్యాపారం వల్లే పేదరికం

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:20 AM

ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య దొరకడం లేదనే కారణంతో మధ్యతరగతి వర్గం వ్యాపారంగా మారిన ప్రైవేటు విద్యను ఆశ్రయిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు.

విద్యా వ్యాపారం వల్లే పేదరికం
School Fees Crisis

  • ప్రైవేటు విద్యతో ఇబ్బందుల్లో మధ్యతరగతి వర్గం

  • విద్య రాష్ట్రాల అధీనంలో ఉన్నప్పుడే న్యాయం

  • ఏపీ మండలి మాజీ ప్రొటెం చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య దొరకడం లేదనే కారణంతో మధ్యతరగతి వర్గం వ్యాపారంగా మారిన ప్రైవేటు విద్యను ఆశ్రయిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. ప్రైవేటు విద్య కోసం తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తూ పేదరికంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టఎప్‌ఐ) దక్షిణాది రాష్ట్రాల మూడురోజుల ఉద్యమ శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించి మా ట్లాడారు.


ఒకటి నుంచి పదో తరగతి వరకు దేశవ్యాప్తంగా పిల్లల పాఠశాల విద్యపై తల్లిదండ్రులు ఏటా రూ.16 లక్షల కోట్ల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. తమ పిల్లలు మెడిసిన్‌ చదవాలని, నీట్‌లో ర్యాంక్‌ సాధించాలనే ఆకాంక్షతో కుటుంబాలు పెడుతున్న ఖర్చు.. కేంద్రం విద్యకు కేటాయించిన బడ్జెట్‌ కంటే అధికంగా ఉందన్నారు. విద్యారంగం రాష్ట్రప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ఆయా రాష్ట్రా ల్లో పిల్లలకు న్యాయం జరిగేదని, కేంద్రం చేతుల్లోకి వెళ్లిన తర్వాత సిలబ్‌సను కూడా మార్చి నేటి సమాజానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.


దేశంలో విలువలతో కూడిన సమాజం ఉండాలంటే విద్యార్థులు, మహిళలు వామపక్ష కార్యకర్తలు, అంబేడ్కర్‌ వాదులందరూ కలిసి ఈ వ్యవస్థను కాపాడాలన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ‘సంక్షోభంలో ప్రజాస్వామ్యం- మేధావుల పాత్ర, భారత ఆర్థిక వ్యవస్థ - మధ్య తరగతిపై ప్రభావం’ అనే అంశాలపై బోధించారు. కార్యక్రమంలో ఎస్‌టీఎ్‌ఫఐ ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి షఫీ, ఉపాధ్యక్షు లు వెంకటేశ్వర్లు, మయిల్‌, అరుణకుమారి, మయవన్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.వెంకట్‌, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘పాలమూరు-రంగారెడ్డి’లో మరో ముందడుగు

మంత్రాల నెపంతో తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కొడుకు

అదిరిపోయే డిజైన్‌తో చిలకపచ్చ చీర!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 05:20 AM