శ్రీశైలం, సాగర్ కింద నిర్మాణాల వివరాలివ్వండి
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:08 AM
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న నిర్మాణాల సమగ్ర వివరాలు ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను మరోమారు కోరింది.
తెలుగు రాష్ట్రాలకు మరోమారు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న నిర్మాణాల సమగ్ర వివరాలు ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను మరోమారు కోరింది. ఈ మేరకు ఈ నెల 6న లేఖ రాసింది. ఈ ప్రాజెక్టుల వివరాల కోసం మూడు నెలల కాలంలో ఇది నాలుగో లేఖ.
2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా... అందులో శ్రీశైలం కింద 11, సాగర్ కింద 2 నిర్మాణాలను అనుమతి లేని వాటి జాబితాలో పెట్టారని, ఆ గెజిట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో అమలు కాకుండా అలాగే ఉందని తెలిపింది. వాటికి ఇచ్చిన వాస్తవ అనుమతులేంటి?, ఏ మేరకు నీటి తరలించడానికి వీలుంది? వంటి వివరాలన్నీ తెలపాలని కోరింది. రెండు రాష్ట్రాలు సమర్పించే సమాచారం భవిష్యత్తులో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల పరిధి, అదనపు నీటి వినియోగంపై జరిగే పరిశీలనలో కీలకంగా మారనుందని గుర్తుచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News