డ్రగ్స్‌పై పోరులో సినీ తారల పాత్ర కీలకం
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:30 AM
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో సినీ తారల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు.
నషా ముక్త్ భారత్ ఉద్యమానికి
ప్రభాస్ మద్దతు కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
‘హైదరాబాద్ వాక్స్’ టీ-షర్ట్‌ల ఆవిష్కరణ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో సినీ తారల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మద్దతు కోరుతూ ఆదివారం ఆయన సినీ నటుడు ప్రభాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ‘హైదరాబాద్ వాక్స్- నషా ముక్త్ భారత్ యాత్ర’ టీ-షర్ట్‌లను ఆవిష్కరించారు. ‘డ్రగ్స్ రహిత భారత్ కోసం మనమందరం గొంతు విప్పుదాం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావాలని ప్రభాస్‌ను కిషన్‌రెడ్డి ఆహ్వానించారు.
కోట్లాది మంది అభిమానులను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేయగల శక్తి ప్రభాస్‌కు ఉందని, ఆయన పిలుపు ఇస్తే యువతలో చైతన్యం వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. కేవలం ప్రభుత్వాల చర్యలతోనే కాకుండా సమాజంలోని ప్రముఖులు, ప్రజల సమష్టి భాగస్వామ్యంతోనే డ్రగ్స్ రహిత భారత్ సాధ్యమవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, నషా ముక్త్ భారత్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, సినీ నటుడు ఆది, ఈగల్ ఫోర్స్ శ్రీనివాస్, యువత పాల్గొన్నారు. అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి హైటెక్స్ మెయిన్ గేట్ వరకు ర్యాలీ కొనసాగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును, కుటుంబాల ప్రశాంతతను, సమాజ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News