Share News

దేశం గర్వించేలా ఖేలో ఇండియా.. అధికారులకు మంత్రి శ్రీహరి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:59 PM

ఖేలో ఇండియా నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని సూచించారు.

దేశం గర్వించేలా ఖేలో ఇండియా.. అధికారులకు మంత్రి శ్రీహరి కీలక ఆదేశాలు
Minister Vakiti Srihari

హైదరాబాద్, నవంబర్ 10: ఖేలో ఇండియా నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు (మంగళవారం) సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతోనే తెలంగాణలో ఖేలో ఇండియా నిర్వహించేందుకు అవకాశం వచ్చిందన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి భవిష్యత్ తరాలకు అందించాలని తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.


అనవసర ఖర్చులు వద్దని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించాలని మంత్రి చెప్పుకొచ్చారు. యువతను రీల్స్, బెట్టింగ్ మహమ్మారి నుంచి బయటకు తీసుకురావాలని డిప్యూటీ కలెక్టర్లకు మంత్రి వాకిటి శ్రీహరి సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ VC&ఎండీ సోనిబాలాదేవి, వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, స్పోర్ట్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఓబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంపై రాహుల్‌తో చర్చించా: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 03:16 PM