Share News

శాసనమండలిలో ప్రతిపక్షం అవసరం

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:45 AM

రాష్ట్ర శాసనమండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం అవసరముందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

శాసనమండలిలో ప్రతిపక్షం అవసరం
Kalvakuntla Kavitha

  • సగానికిపైగా బీఆర్‌ఎస్‌ సభ్యులు కాంగ్రెస్‌లో చేరారు

  • తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర శాసనమండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం అవసరముందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొందని.. బీఆర్‌ఎస్‌ సభ్యులు సగానికిపైగా కాంగ్రె్‌సలో చేరారని, బీజేపీ సభ్యులు కాంగ్రె్‌సతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌, ఆకాశ్‌ కొల్లూరితో కలిసి బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకొని ఓటు వేస్తారని కాంగ్రెస్‌ భావిస్తోందని కవిత ఆరోపించారు.


రూ.200కోట్లు ఖర్చు పెట్టయినా సరే తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు తీసుకొని తమను గెలిపిస్తారనే.. రాజకీయ నాయకుల అపవాదును తొలగించుకోవాల్సిన అవసరం గ్రాడ్యుయేట్లకు ఉందని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్‌ కొల్లూరి, నల్లగొండ - ఖమ్మం- వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి శ్రీకాంత్‌గౌడ్‌ను గెలిపించాలని కోరారు. సామాజిక న్యాయంలో భాగంగా తాము ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:45 AM