Share News

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కవిత

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:28 PM

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ కవిత మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కవిత
Kavitha

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ సభలో బీజేపీపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని జాగృతి అధ్యక్షురాలు నిలదీశారు.


వెయ్యి ఏళ్లైనా బీఆర్‌ఎస్ మారదని కవిత వ్యాఖ్యానించారు. గుంటనక్క నిన్న(సోమవారం) ఢిల్లీ వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలను కలిసిందన్నారు. ప్రాజెక్ట్‌ల్లో అవినీతి నుంచి బయటపడేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు జరిపారంటూ కవిత ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్

సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 02:02 PM