Share News

బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:46 AM

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు.

బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్
Minister Vakati Srihari

హైదరాబాద్, ఏప్రిల్ 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సవాల్ విసిరారు. మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపిస్తే ఇక్కడి నుంచి ఏబీఎన్‌తో పాటు వెళ్లి ఇప్పుడే రాజీనామాకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఇంకా భ్రమల్లో ఉన్నారని.. ఆయన మాటలకు విశ్వసనీయత లేదని మంత్రి వ్యాఖ్యానించారు.


ప్రజల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని మంత్రి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

అప్పుడు బీఆర్‌ఎస్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎంలా కాళేశ్వరం: బండి సంజయ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 12:25 PM