అప్పుడు బీఆర్‌ఎస్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎంలా కాళేశ్వరం: బండి సంజయ్
ABN , Publish Date - Apr 21 , 2026 | 10:43 AM
కేసీఆర్, రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్, రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన స్కామ్ రూ.లక్ష కోట్లా? రూ.9వేల కోట్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని నిలదీశారు.
గతంలో బీఆర్‌ఎస్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేంద్రానికి రేవంత్‌రెడ్డి రాసిన లేఖలో ఏముందని అడిగారు. రూ.9వేల కోట్ల అవినీతిపై దర్యాప్తు జరపాలని సీఎం రేవంత్ అంటున్నారని.. మరి లక్ష కోట్ల స్కామ్ గురించి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. రేవంత్ రాసిన లేఖలను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంచుతామన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ టూర్‌పై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
మహిళలు ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీకి పదవులు ఇస్తే మొత్తం మహిళలకు పదవులు వచ్చినట్టు భావిస్తున్నారన్నారు. విపక్షాల కుటుంబాల్లోని మహిళలకు పదవులు వస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగితే.. సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్లేస్‌లో కూర్చోవాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోవడానికి స్టాలిన్, రేవంత్ రెడ్డినే కారణమని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పటికీ కలవవని.. కలిసి పోటీ చేయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన రైలు.. రైతుకు తీవ్రగాయాలు..
దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News