మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీ షీటర్ హల్‌చల్..
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:35 AM
రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఇద్దరు వ్యక్తులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే..
మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 21: రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులైన మహమ్మద్ ఫరీస్, మహమ్మద్ ఇస్మాయిల్‌ను.. అట్టా ఉల్లా ఖాన్ అనే రౌడీ షీటర్, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తమ వద్ద లేవని బాధితులు చెప్పడంతో రౌడీ షీటర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడి చేశాడు. బాధితులు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా విచక్షణారహితంగా పొడవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు అక్కడికి రావడం చూసి రౌడీషీటర్ పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను స్థానికులు వెంటనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న రౌడీ షీటర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే ఇలా దాడి జరగడం చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
జనరల్ స్టోర్‌లో చోరీ.. పోలీసులను ఆశ్రయించిన యజమాని
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన రైలు.. రైతుకు తీవ్రగాయాలు..
Read Latest AP News And Telugu News