సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందం.. ఆధునిక పరిపాలనపై అధ్యయనం
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:15 AM
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్‌లో మంత్రుల బృందం పర్యటించనుంది.
అమరావతి/సింగపూర్, ఏప్రిల్ 21: సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈరోజు(మంగళవారం) ఉదయం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి సింగపూర్ చేరుకున్నారు. మంత్రుల బృందానికి సింగపూర్‌లోని తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు సింగపూర్‌లో మంత్రుల బృందం అధికారికంగా పర్యటించనుంది.
సింగపూర్‌లో ఆధునిక పరిపాలనా విధానాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ బృందం అధ్యయనం చేయనుంది. సింగపూర్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌తో ‘సింగపూర్-AP జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్’ (SGJIWC) అవగాహనా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా సింగపూర్ పాలనా నమూనా, రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్' (ToT) శిక్షణా కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన రైలు.. రైతుకు తీవ్రగాయాలు..
దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
Read Latest AP News And Telugu News