Share News

అయ్యప్ప సొసైటీలో సీఎం, ఆయన కుటుంబ దోపిడీ

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:09 AM

సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబంపై తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షు రాలు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ లోని అయ్యప్ప సొసైటీని చెరబట్టిన సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.

అయ్యప్ప సొసైటీలో సీఎం, ఆయన కుటుంబ దోపిడీ
Kalvakuntla Kavitha

  • నా భూములపై ఎటువంటి విచారణకైనా సిద్ధమే

  • రాష్ట్రానికి పైసా సాయం ప్రకటించని షా: కవిత

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబంపై తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షు రాలు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ లోని అయ్యప్ప సొసైటీని చెరబట్టిన సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు లేని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పేర్చొద్దని హైకోర్టు ఆదేశం ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సోసైటీలోని గురుకుల ట్రస్టు భూముల్లో వచ్చిన 500-700 అక్రమ నిర్మాణాలకు సీఎం సోదరులే అనుమతులిప్పిస్తూ కమీషన్లు దండుకుంటున్నారని కవిత గురువారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మీడియాతో చెప్పారు. మునిసిపల్‌శాఖ తన వద్ద పెట్టుకున్న సీఎం.. పెద్ద బిల్డర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు.


కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా అనుమతించిన 700 నిర్మాణాలకు చేస్తున్న నోటరీ రిజిస్ట్రేషన్లు చెల్లవని, ఎవరూ అయ్యప్ప సొసైటీలో ఇళ్లు కొనవద్దన్న కవిత.. ఈ ప్రాంతంలో సమగ్ర సర్వే చేసి అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉన్నా.. ప్రయోజనం లేకపోయిందని, 18 వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తన వద్ద ఇంచు అసైన్డ్‌/ ఇనాం భూములున్నా ప్రభుత్వానికే రాసిస్తానని చెప్పారు. తన భూములపై ఎటువంటి విచారణకైనా సిద్ధమేనన్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో 320 మండలాల్లో కరువు ఉంటే, హైద రాబాద్‌ కొచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పైసా సాయం ప్రకటించలేదని కవిత ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:09 AM