Share News

కార్తిక దీపం వెలిగిస్తుండగా విషాదం

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:32 AM

కార్తిక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ మహిళ మృతి చెందారు.

కార్తిక దీపం వెలిగిస్తుండగా విషాదం

  • చీరకు నిప్పంటుకుని మహిళ మృతి

అమీర్‌పేట, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): కార్తిక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. చాపర్ల భానుమతి(62) ఎస్‌ఆర్‌ నగర్‌లోని జగన్నాథ రెసిడెన్సీలో కూతురు కిన్నెర వద్ద ఉంటున్నారు.


కార్తిక మాసం సందర్భంగా సోమవారం ఇంట్లో దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుంది. క్షణాల్లోనే మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:32 AM