Share News

కాండ్లాపూర్‌ రైతుల దీక్ష భగ్నం

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:25 AM

ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూములు ఇవ్వబోమంటూ పరిగి బస్టాండ్‌ రోడ్డుపై కాండ్లాపూర్‌ రైతులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేశారు.

కాండ్లాపూర్‌ రైతుల దీక్ష భగ్నం
Kandlapur Farmers Protest

  • అరెస్ట్‌ చేసి వికారాబాద్‌కు తరలింపు

  • వికారాబాద్‌ నుంచి చన్‌గోముల్‌, కంకల్‌కు..

  • కాండ్లాపూర్‌లో వదిలిపెట్టిన పోలీసులు

పరిగి, సెప్టెంబరు 13 (ఆంద్రజ్యోతి): ఇండస్ట్రియల్‌ పార్కుకు భూములు ఇచ్చేదే లేదని వికారాబాద్‌ జిల్లా పరిగి బస్టాండ్‌ రోడ్డుపై పరిగి మండలం కాండ్లాపూర్‌ రైతులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కాండ్లాపూర్‌ భూములను పరిశ్రమలకు తీసుకున్నామని అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చెప్పడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ రైతులు శనివారం మధ్యాహ్నం నుంచి దీక్షకు దిగారు. అర్ధరాత్రి వరకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కొనసాగిన దీక్షను అదేరోజు రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశారు. రైతులను వాహనంలో ఎక్కించి వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కేంద్రానికి తరలించారు.


ఆదివారం అక్కడి నుంచి రైతులను చోన్‌గోముల్‌ పీఎ్‌సకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంగడిచిట్టెంపల్లి, కంకల్‌, లాల్‌పహాడ్‌ మీదుగా కాండ్లాపూర్‌లో వదిలిపెట్టేందుకు పోలీస్‌ వాహనం వెళుతుండగా.. మిషన్‌భగీరథ గ్రిడ్‌ దగ్గర రైతులు వాహనంలోనే నిరసనకు దిగారు.. ‘మేం గ్రామానికి వెళ్లం.. ఎమ్మెల్యే, కలెక్టర్‌ మా భూములు తీసుకోబోమని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం’ అని స్పష్టం చేశారు. రైతులు ఒక్కసారిగా పోలీస్‌ వాహనం నుంచి బయటకు దూకేందుకు యత్నించారు. పోలీసులు వారిని సముదాయించి గ్రామంలో వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా, రైతులను మద్దతుగా పరామర్శించేందుకు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ శ్రేణులు కాండ్లాపూర్‌ గ్రామానికి వెళ్తుండగా జాఫర్‌పల్లి గేట్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్‌లో పారదర్శకత ఏదీ?

బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా రాంరెడ్డి, వెంకట్‌యాదవ్‌ ఎన్నిక

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 06:39 AM