Share News

బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా రాంరెడ్డి, వెంకట్‌యాదవ్‌ ఎన్నిక

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:16 AM

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సాముల రాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా చలకాని వెంకట్‌యాదవ్‌ ఎన్నికయ్యారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా జీ కిరణ్‌కుమార్‌ విజయం సాధించారు.

బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా  రాంరెడ్డి, వెంకట్‌యాదవ్‌ ఎన్నిక
Telangana Bar Council Election

  • బీసీఐ సభ్యుడిగా కిరణ్‌ కుమార్‌ గెలుపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సాముల రాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా చలకాని వెంకట్‌యాదవ్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం డియా (బీసీఐ) మెంబర్‌గా జీ కిరణ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆదివారం హైకోర్టు ప్రాంగణంలోని బార్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో ఈ పదవులకు ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల ద్వారా ఎన్నికైన 26 మంది బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చైర్మన్‌ పదవికి పోటీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోదరుడు, కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ పొన్నం అశోక్‌ గౌడ్‌కు 11 ఓట్లు, టీ హనుమంత్‌రెడ్డికి 3 ఓట్లు, సాముల రాంరెడ్డికి 12 ఓట్లు వచ్చాయి. వైస్‌ చైర్మన్‌ పదవికి పోటీ చేసిన గోకుల్‌ రామారావుకు 3 ఓట్లు, చలకాని వెంకట్‌యాదవ్‌కు 13 ఓట్లు, జాకీర్‌ హుస్సేన్‌ జావిద్‌కు 10 ఓట్లు వచ్చాయి. బీసీఐ మెంబర్‌ పదవికి పోటీ చేసిన ఆకుల అనంత్‌సేన్‌రెడ్డి 3 ఓట్లు, అనిల్‌ కిరణ్‌కుమార్‌ 2 ఓట్లు, డీ జగదీశ్వర్‌కు 7 ఓట్లు, జీ కిరణ్‌కుమార్‌ 10 ఓట్లు, పాశం సుజాతకు 4 ఓట్లు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్‌లో పారదర్శకత ఏదీ?

77 వేల కోట్లు మూలుగుతున్నాయ్‌!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 06:16 AM