77 వేల కోట్లు మూలుగుతున్నాయ్!
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:32 AM
భవన, ఇతర నిర్మాణ రంగాల్లోని కార్మికుల(బీవోసీడబ్ల్యూ) సెస్ కార్ప్‌సలో రూ.77 వేల కోట్ల మేరకు నిధులు మూలుగుతున్నాయని వాటిని ఖర్చు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నిధులను కార్మికులకు పింఛను, వారి కుటుంబాల దీర్ఘకాలిక సంక్షేమం సహా.. సామాజిక భద్రతకు ఊతమిచ్చే ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవాలని కోరింది
కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయండి
రాష్ట్రాలకు కేంద్రమంత్రి మన్సుఖ్ పిలుపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: భవన, ఇతర నిర్మాణ రంగాల్లోని కార్మికుల(బీవోసీడబ్ల్యూ) సెస్ కార్ప్‌సలో రూ.77 వేల కోట్ల మేరకు నిధులు మూలుగుతున్నాయని వాటిని ఖర్చు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నిధులను కార్మికులకు పింఛను, వారి కుటుంబాల దీర్ఘకాలిక సంక్షేమం సహా.. సామాజిక భద్రతకు ఊతమిచ్చే ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవాలని కోరింది. ఈ మేరకు ముంబైలో జరిగిన బీవోసీడబ్ల్యూ జాతీయ సదస్సులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు పింఛన్లతోపాటు గుర్తించిన ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఈ నిధులను వినియోగించుకోవాలని కోరారు. ‘‘నిధుల వినియోగంలో లోపాలను గుర్తించి సరిచేయాలి. కార్మికుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.’’ అని మాండవీయ అన్నారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో కార్మికుల భద్రతకు కూడా ఈ నిధులు వినియోగించుకోవాలన్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సైతం ఇదే పిలుపునిచ్చారు. ‘‘వయో వృద్ధులైన కార్మికులకు పింఛన్లు, వారి పిల్లల చదువులకు, ఆరోగ్య సంరక్షణకు, పని ప్రదేశాల్లో కార్మికుల భద్రతకు, మహిళా కార్మికుల శానిటేషన్ సౌకర్యాలు, ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఈ నిధులు వినియోగించవచ్చు.’’ అని ఆమె తెలిపారు.