Share News

కమ్యూనిస్టు పార్టీలన్నీ విలీనం కావాలి

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:36 AM

వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు అహంభావాన్ని వీడాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టు పార్టీలన్నీ విలీనం కావాలి

  • యూఎల్‌డీఎఫ్‌ సదస్సులో జస్టిస్‌ చంద్రకుమార్‌ పిలుపు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు అహంభావాన్ని వీడాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ పిలుపునిచ్చారు. ఆయా కమ్యూనిస్టు పార్టీలన్నీ విలీనమైతే.. వామపక్ష సానుభూతి పరులు, ప్రజా సంఘాల సభ్యులు, అభ్యుదయ వాదులు, మేధావులు కొత్త ఉత్సాహాన్ని పొందుతారన్నారు. తద్వారా కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.


ఇందుకోసం వామపక్ష, ప్రజాతంత్ర ఐక్యవేదిక(యూఎల్‌డీఎఫ్‌) ప్రయత్నిస్తోందని ఉద్ఘాటించారు. యూఎల్‌డీఎఫ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ‘దేశం కోసం వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశంలో నానాటికి మతోన్మాద శక్తులు బలోపేతమవుతుండగా, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంక్షుభిత సమయంలో వామపక్ష, ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామిక, బహుజన శక్తులు ఒక్కటై ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపే బాధ్యతను భుజానికెత్తుకోవాలని అభ్యర్థించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 05:36 AM