Share News

కారు లేకున్నా ఉన్నట్లు చూపి..

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:12 AM

తమ పేరు మీద కారు, భూమి లేకపోయినా ఉన్నాయని చూపి ఇందిరమ్మ ఇళ్ల టవర్ల జాబితాలో అనర్హులుగా చేర్చారని పలువురు దరఖాస్తు దారులు పేర్కొంటున్నారు.

కారు లేకున్నా ఉన్నట్లు చూపి..
Indiramma houses

  • ఇందిరమ్మ ఇళ్ల అనర్హత లిస్టులో పలువురి పేర్లు..!

  • లబ్ధిదారుల్లో ఆందోళన

  • నేటి సాయంత్రం ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు

  • హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతం

హైదరాబాద్‌ సిటీ: తమ పేరు మీద కారు, భూమి లేకపోయినా ఉన్నాయని చూపి ఇందిరమ్మ ఇళ్ల టవర్ల జాబితాలో అనర్హులుగా చేర్చారని పలువురు దరఖాస్తు దారులు హౌసింగ్‌బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ పేర్లు అర్హుల జాబితాలో చేర్చాలంటూ వారు డిమాండ్‌ చేశారు. అయితే, జాబితాలో అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో తెలియచేయవచ్చని, అర్హులైనవారి వివరాలు తుదిజాబితాలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లుకోసం దరఖాస్తు చేసుకున్న ఎ.జ్యోతి భర్త కూకట్‌పల్లిలోని ఓ టీస్టాల్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తమ పేరుమీద రెండు కార్లు ఉన్నాయంటూ అనర్హత లిస్ట్‌లో పెట్టారని, తమకు ఆ కార్లకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తమ పేరు జాబితాలో చేర్చాలంటూ ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.


city3.jpgకొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన కొనసాగుతున్నదని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమికంగా అనర్హులుగా గుర్తించిన వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు కూడా పరిశీలిస్తునట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో వెల్లడిస్తామని పేర్కొన్నారు.


క్యూర్‌ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లటవర్స్‌కు 60,720 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో ఫోర్‌వీలర్స్‌ ఉండి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్న వారిని అనర్హులుగా పరిగణించామని, క్యాబ్‌లుగా వినియోగిస్తున్న దరఖాస్తు దారులను అర్హులుగా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వివరాలు tghb.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇతర వివరాలకు కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040 24603572 లో సంప్రదించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 09:55 AM