Share News

19న ఇందిరమ్మ బీమా ప్రారంభం

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:54 AM

సిద్దిపేట వేదికగా ఈనెల 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వెల్లడించారు.

19న ఇందిరమ్మ బీమా ప్రారంభం
Aadi Srinivas

  • హరీశ్‌ కౌంట్‌డౌన్‌ మొదలు: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట వేదికగా ఈనెల 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5లక్షల బీమా ధీమాను కల్పించబోతున్నట్లు చెప్పారు. సిద్దిపేటలో సీఎం సభతో హరీశ్‌రావు కౌంట్‌డౌన్‌ మొదలవుతుందన్నారు.


ఆదివారం సీఎల్పీ మీడియా హాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ సిద్దిపేటకు వస్తానని చెప్పడంతోనే హరీశ్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. కవిత పార్టీని రేవంత్‌ రక్షణ సేనగా అభివర్ణిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. బీఆర్‌ఎస్‌లో ఆయన బలికా బకరా అన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. హరీశ్‌కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:54 AM