తెలంగాణలో ఎల్నినో పర్యవేక్షణకు ఐఏఎస్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:10 PM
ఎల్నినో నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ దేశాలను వణికిస్తున్న సూపర్ ఎల్నినో సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించడానికి ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్లను నియమించింది. ఈ నేపథ్యంలో వీరు రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, వర్షపాతం మరియు విద్యుత్ సరఫరా, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు వీళ్లే:
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా: జయేష్ రంజన్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : వికాస్ రాజ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా : బెనహర్ మహేష్ దత్తా ఎక్కా
ఉమ్మడి మెదక్ జిల్లా : ఎ. వాణి ప్రసాద్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: యోగితా రాణా
ఉమ్మడి నల్గొండ జిల్లా : హరిచందన దాసరి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : ఇలాంబర్తి కె.
ఉమ్మడి వరంగల్ జిల్లా : ఎ. శ్రీదేవిసేన
ఉమ్మడి మహబూబ్నగర్ : వి.పి. గౌతమ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా : అనుదీప్ దురిశెట్టి
ఈ వార్తలు కూడా చదవండి..
పుంగనూరులో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: జిల్లా ఎస్పీ
పుంగనూరు దాడులపై వైసీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్
For More AP News And Telugu News