హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టులో హాజరుపరచండి.. డీజీపీకి హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Nov 11 , 2026 | 09:20 PM
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కారణ నేరం కింద రంగనాథ్‌ను హైకోర్టు ముందు హాజరు పరచవలసిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 11: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కారణ నేరం కింద రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్‌ను హైకోర్టు ముందు హాజరు పరచవలసిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ధిక్కరణ నేరం కింద.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వచ్చే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు శంషాబాద్ తహసీల్దార్‌ను కూడా కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది. కోర్టు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాకపోవడాన్ని కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుతూ.. రంగనాథ్, తహసీల్దార్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత మాజీ ఉప రాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More TG News And Telugu News