భారత మాజీ ఉప రాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:10 PM
భారత మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం న్యూఢిల్లీలోని నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
న్యూఢిల్లీ, నవంబర్11: భారత మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం న్యూఢిల్లీలోని నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం స్పృహ కొల్పోయారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయనను పీసీఆర్ వాహనంలో ఇంటికి తరలించారు. ఆయనకు వైద్య బృందం చికిత్స అందించింది.
అయితే జగదీప్ ధనకర్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. దీంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ వైద్యుడు సందీప్ సేథి సారథ్యంలో ఐఎల్‌బీఎస్ వైద్య బృందం ఆయనకు వైద్యం అందిస్తుంది. జగదీప్ ధన్కర్ ఆరోగ్యంపై ఎయిమ్స్ వర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
గత రెండేళ్లుగా జగదీప్ ధన్కర్ తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. 2022లో భారత 14వ ఉప రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2025, ఆగస్టులో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా పని చేశారు.