నీటి వృథా.. జరిమానా..
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:12 AM
తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపడుతోంది.
వాట్సాప్ ఫిర్యాదుపై క్షేత్రస్థాయి తనిఖీ
హైదరాబాద్ సిటీ: తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఓ నివాసానికి రూ.5వేల జరిమానా విధించింది. రోడ్ నంబర్ 57 ప్లాట్ నంబర్ 1157లో తాగునీటితో ఇంటి ప్రాంగణం శుభ్రపరుస్తున్నట్లు స్థానికులు వాటర్‌బోర్డు వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు.
అధికారులు తనిఖీ చేపట్టి, అక్కడ తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారించుకుని, సంబంధిత యజమానికి రూ.5వేల జరిమానా విధించారు. తాగునీటి వృథా, దుర్వినియోగం ఘటనలు ఎక్కడైనా ప్రజల దృష్టికి వస్తే ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, పూర్తి చిరునామాతో జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003కు సమాచారం అందించాలని వాటర్‌బోర్డు విజ్ఞప్తి చేసింది.
అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం
తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై వాటర్‌బోర్డు విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం కొత్వాల్‌గూడ వార్డులోని ఆర్‌బీ నగర్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని వాటర్‌బోర్డు హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్ చిట్టితల్లీ
బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్ స్టోరేజీ విద్యుత్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News