Share News

కరువు వస్తే కేటీఆర్‌, హరీశ్‌లకు ఎందుకంత ఆనందం?: చనగాని

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:06 AM

రాష్ట్రంలో కరువు వస్తే కేటీఆర్‌, హరీ‌ష్‌రావులకు ఎందుకంత ఆనందమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు.

కరువు వస్తే కేటీఆర్‌, హరీశ్‌లకు ఎందుకంత ఆనందం?: చనగాని
Chanagani Dayakar Goud

రాష్ట్రంలో కరువు వస్తే కేటీఆర్‌, హరీ‌ష్‌రావులకు ఎందుకంత ఆనందమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఇద్దరూ ఊర్లు పంచుకుని ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎల్‌నినో కారణంగా 58 దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, అయితే కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు వారిద్దరినీ కోదండం వేయించాలన్నారు. కరువును రాజకీయం చేయడాన్ని నిరసిస్తూ గాంధీభవన్‌లో కేటీఆర్‌, హరీష్‌రావు దిష్టి బొమ్మలను కాంగ్రెస్‌ కార్యకర్తలు దగ్ధం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 07:06 AM