Share News

ఆ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

ABN , Publish Date - Mar 06 , 2026 | 07:25 AM

నగరంలోని పలు ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలేత్తనున్నట్టు వాటర్‌ బోర్డు అధికారులు ప్రకటించారు.

ఆ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలేత్తనున్నట్టు వాటర్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్‌-3 పెద్దాపూర్‌ పంప్‌లోని పంప్‌హౌ్‌సలో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టీ (హై టెన్షన్‌) ఎలక్ట్రికల్‌ ప్యానల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో పెద్దాపూర్‌ నుంచి సింగాపూర్‌ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్‌ మెయిన్‌ పైప్‌లైన్‌లోని ఎయిర్‌ వాల్వ్‌లను, అలాగే సింగాపూర్‌ నుంచి పెద్దాపూర్‌ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్‌ పైప్‌లైన్‌లోని ఎయిర్‌ వెంట్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపట్టనున్నారు.


city2.2.jpgఈ పనులను శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు సాగుతాయని, దాంతో మంజీరా జలాల సరఫరా నగరానికి నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. దీంతో 36 గంటల పాటు కొన్ని ప్రాంతాలకు లో ప్రెజర్‌తో నీటి సరఫరా, మరికొన్ని ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని, ప్రధానంగా షేక్‌పేట్‌ రిజర్వాయర్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలుస్తుందని, భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. మణికొండ, కోకాపేట్‌, నార్సింగి, మంచిరేవుల(Manikonda, Kokapet, Narsingi, Manchirevula) తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, ఆయా ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ విఫలం

మీకు అంతా తెలుసుగా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2026 | 07:30 AM