మహిళా భద్రతకు రంగంలోకి ‘షీ నేత్ర టీమ్స్’
ABN , Publish Date - Jun 30 , 2026 | 09:43 AM
హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలతోపాటు.. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు పోలీసు విభాగం సరికొత్త అస్త్రం షీ నేత్రను రంగంలోకి దింపింది.
ఏడు జోన్‌లలో తనిఖీలు
అత్యాధునిక కెమెరాలు, డిటెక్టర్లతో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ: హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలతోపాటు.. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్ పోలీసు విభాగం సరికొత్త అస్త్రం షీ నేత్రను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. నిఘా కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ‘షీ నేత్ర’ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ -10న సిటీ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక షీ నేత్ర టీమ్‌లు ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు.
అందులో భాగంగా అత్యాధునిక కెమెరాలు, డిటెక్టర్ల వినియోగం, నిబంధనల ఎస్‌వోపీపై రెండు దశల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో షీటీమ్స్ బృందాలు షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్‌లు, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఏడు బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయని సీపీ తెలిపారు.
తమ ప్రాంగణాల్లోని ప్రైవేటు ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. ప్రతి సంస్థ తప్పనిసరిగా ‘కస్టమర్ ేసఫ్టీ ఇన్ చార్జీ’ని నియమించుకోవాలని, వీరు షీ టీమ్స్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించారు. మహిళల భద్రత సమిష్టి బాధ్యతని, ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులను గుర్తిేస్త వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ నంబర్ 9490616555కు సమాచారం అందించాలని సీపీ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News