నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
ABN , Publish Date - Jun 30 , 2026 | 07:19 AM
అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక అనిశ్చితుల కారణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయి. ఇటీవల ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో వీటి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక అనిశ్చితుల కారణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయి. ఇటీవల ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో వీటి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు(మంగళవారం) ఉదయం 7 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. భారతదేశంలో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.14,192 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము పసిడి రేటు రూ.13,009గా ఉంది. ఇక, గ్రాము వెండి ధర రూ.239.90 కాగా.. కిలో వెండి రేటు రూ.2,39,900కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,42,070 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,30,240గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,41,920కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,30,090కి చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,45,080 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,32,990గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,41,920కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,30,090కి చేరింది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,41,920కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,30,090కి చేరింది.
వెండి విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో గ్రాము వెండి ధర రూ.239.90ఉండగా.. కిలో రేటు రూ.2,39,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో గ్రాము వెండి ధర రూ.244.90కి చేరుకోగా.. కిలో ధర రూ.2,44,900కి చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్
స్టార్ట్‌ప్సకు డిజిటల్ సంకెళ్లు వద్దు..