Share News

స్టార్టప్స్‌కు డిజిటల్‌ సంకెళ్లు వద్దు

ABN , Publish Date - Jun 30 , 2026 | 03:58 AM

కొత్తగా రూపొందించే డిజిటల్‌ నిబంధనలు స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప, వాటి వృద్ధికి ప్రతిబంధకంగా ఉండకూడదని ఒక నివేదిక పేర్కొంది.

స్టార్టప్స్‌కు డిజిటల్‌ సంకెళ్లు వద్దు

కఠిన నిబంధనలతో రూ.91,500 కోట్ల పెట్టుబడులకు ఎసరు!

2.45 లక్షల ఉద్యోగాలకు గండి!!

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా

న్యూఢిల్లీ: కొత్తగా రూపొందించే డిజిటల్‌ నిబంధనలు స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప, వాటి వృద్ధికి ప్రతిబంధకంగా ఉండకూడదని ఒక నివేదిక పేర్కొంది. నియంత్రణ అధికమైతే స్టార్టప్స్‌లోకి వచ్చే పెట్టుబడులు, వాటిలో ఉద్యోగాల కల్పన నీరుగారిపోయే ప్రమాదం ఉందని ‘ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌’ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక హెచ్చరించింది. కఠినతర డిజిటల్‌ నిబంధనలతో 2035 నాటికి స్టార్టప్స్‌లోకి వచ్చే రూ.91,500 కోట్ల పెట్టుబడులు, 2.45 లక్షల ఉద్యోగ అవకాశాలు చేజారి పోవచ్చని అంచనా వేసింది. విశ్వాస కల్పన, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌కు నిబంధనలు అవసరమైనా ఆ నిబంధనలు సార్టప్‌ రంగంలో వినూత్న ఆవిష్కరణలు, పెట్టుబడులు, వాటి అభివృద్ధిని దెబ్బతీసేలా ఉండకూడదని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ నివేదిక స్పష్టం చేసింది. 550 స్టార్టప్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌, ఇంక్యుబేటర్లను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు.

  • ఇతర ప్రధాన అంశాలు

  • భవిష్యత్‌ నిబంధనలపై 68 శాతం స్టార్టప్స్‌లో అనిశ్చితి.

  • నిర్వహణాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయన్న 88 శాతం స్టార్టప్స్‌.

  • డిజిటల్‌ నిబంధనలు కఠినంగా ఉంటే స్టార్టప్స్‌ పరిశోధనలు, నవ కల్పనల కంటే ఆ నిబంధనల పాటింపుపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్న 72 శాతం స్టార్టప్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌.

  • స్టార్టప్స్‌ ఏర్పాటు, వీసీల ఫండింగ్‌ 20శాతం తగ్గే అవకాశం.

  • నిబంధనలు అనుకూలంగా ఉంటే వార్షిక స్టార్టప్స్‌ ఏర్పాటు 7 శాతం, వీసీల ఫండింగ్‌ 9 శాతం, ఉద్యోగాల కల్పన 80,000 పెరిగే అవకాశం.

Updated Date - Jun 30 , 2026 | 07:30 AM