హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థికి గుండు కొట్టిన స్కూల్ ప్రిన్సిపాల్
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:20 PM
మియాపూర్ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందనే కారణంతో బలవంతంగా గుండు కొట్టారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మియాపూర్ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందనే కారణంతో బలవంతంగా గుండు కొట్టారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మియాపూర్ ప్రేమ్ నగర్, బీ-బ్లాక్‌లోని బ్లాక్ బోర్డు ది స్కూల్లో ఈశ్వర్ అనే విద్యార్థి తోమ్మిదోవ తరగతి చదువుతున్నాడు. ఈశ్వర్‌కు జుట్టు ఎక్కువగా ఉందని..జట్టు కత్తిరించుకోవాలని స్కూల్ ప్రిన్సిపాల్ సూచించారు. లక్ష్మీనరసింహ స్వామికి తలనీలాల మొక్కు ఉందని.. అందుకే జుట్టు పెంచుకున్నట్లు విద్యార్థి వివరించారు. ప్రిన్సిపాల్‌కు ఈ విషయం తెలిపినప్పటికీ.. మరుసటి రోజు విద్యార్థికి బలవంతంగా ప్రిన్సిపాల్ గుండు కొట్టించారు.
తల్లిదండ్రుల ఆందోళన
ఈ వ్యవహరంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లల భద్రతపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ చర్యను తీవ్రంగా ఖండించారు. స్కూల్‌లో విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని తల్లిదండ్రులుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు..
సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News