హైదరాబాద్ ‘సరస్ మేళా’లో రికార్డు స్థాయి వ్యాపారం.. రూ.9.29 కోట్ల అమ్మకాలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 08:31 PM
హైదరాబాద్ ‘సరస్ మేళా’కు విశేష స్పందన లభించింది. ఈ ఏడాది సుమారు 5.98 లక్షల మంది మేళాను సందర్శించగా.. రికార్డు స్థాయిలో రూ. 9.29 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు మంత్రి సీతక్క మహిళా సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 19: నగరంలో ఏర్పాటు చేసిన ‘సరస్ మేళా’కు భారీ స్పందన లభించింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగిన ఈ మేళాను సుమారు 5.98 లక్షల మంది సందర్శించారు. రికార్డు స్థాయిలో రూ.9.29 కోట్ల అమ్మకాలు నమోదు కాగా.. మహిళా సంఘాలకు భారీగా ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. చివరి నాలుగు రోజుల్లోనే రోజుకు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ మేరకు మంత్రి సీతక్క మహిళా సంఘ సభ్యులకు, అధికారులకు అభినందనలు తెలిపారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం(సెర్ప్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సరస్ మేళా’కు భారీ స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తూ.. మహిళా సాధికారతకు తోడ్పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయాల కోసం 225 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన మేళాలో కనీవినీ ఎరుగని రీతిలో అమ్మకాలు జరిగాయని.. మహిళా సంఘాలకు భారీగా ఆదాయం లభించిందన్నారు. 2025లో రూ.3.28 కోట్ల అమ్మకాలు నమోదు కాగా.. ఈ ఏడాది రూ.9.29 కోట్లకు వ్యాపారం చేరుకుందని వెల్లడించారు. ఈ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విశేషంగా ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేట్ టెండర్లతో సంస్థ మనుగడకు ముప్పు: ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు