Share News

ప్రైవేట్ టెండర్లతో సంస్థ మనుగడకు ముప్పు: ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:50 PM

విద్యుత్ బస్సుల ప్రైవేట్ టెండర్లతో ఆర్టీసీ మనుగడతోపాటు ఉద్యోగుల ఉపాధి భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ టెండర్లతో సంస్థ మనుగడకు ముప్పు: ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ
APSRTC JAC

అమరావతి, అక్టోబర్19: విద్యుత్ బస్సుల ప్రైవేట్ టెండర్లతో ఆర్టీసీ మనుగడతోపాటు ఉద్యోగుల ఉపాధి భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 1,450 విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ పరిరక్షణ కోసం అక్టోబర్ 22, 23 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో సిబ్బంది నిరసనలు తెలపాలని నిర్ణయించినట్లు తెలిపారు.


సోమవారం విజయవాడలో జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు విలేకర్లతో మాట్లాడారు. అక్టోబర్ 26వ తేదీన విజయవాడలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఆర్టీసీ డిపోలు, మౌలిక సదుపాయాలను ప్రైవేటుకు అప్పగించ వద్దని ప్రభుత్వానికి సూచించారు. అయితే విద్యుత్ బస్సులకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. వాటిని ఆర్టీసీయే కొనుగోలు చేసి సొంత సిబ్బందితో నిర్వహించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.


ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగించ వద్దని చెప్పారు. అలాగే 15 వేల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూసి వేసిన నాలుగు డిపోలను మళ్లీ తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 22, 23 తేదీల్లో అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై శాంతియుత నిరసనలు చేపడతామని కన్వీనర్లు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌నినోపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ

నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 05:57 PM