ఎల్‌నినోపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:21 PM
రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు వాకిటి శ్రీహరి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై ఈ కమిటీ సమీక్షించనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. నీటి లభ్యత, తాగు నీటి సరఫరాపై నిరంతర సమీక్షలు నిర్వహించనుంది. ఇక జల సంరక్షణకు ప్రాధాన్యం.. ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. వేసవికి ముందే గ్రామీణ నీటి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. అలాగే ఎల్‌నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.
నిధుల ఖర్చులో జాప్యం ఉండొద్దు: డిప్యూటీ సీఎం భట్టి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలని అధికారులను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నిధుల ఖర్చులో జాప్యం ఉండొద్దని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రుణాల పునర్ వ్యవస్థీకరణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపులు, నిధుల వ్యయంపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం.. 100 మందిపై కేసులు
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు
For More TG News And Telugu News