Share News

హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం.. 100 మందిపై కేసులు

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:54 PM

నకిలీ నంబర్ ప్లేట్ల వాహనాలపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా వాహనాలు సీజ్ చేశారు.

హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం.. 100 మందిపై కేసులు

హైదరాబాద్, అక్టోబర్ 19: నకిలీ నంబర్ ప్లేట్ల వాహనాలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా వాహనాలు సీజ్ చేశారు. నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలు వినియోగిస్తున్న 100 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత 8 నెలల్లో 88 ద్విచక్ర వాహనాలతోపాటు12 కార్లను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. నకిలీ, మార్చిన, అనధికారిక నంబర్ ప్లేట్లు చట్ట రీత్యా నిషేధమని నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.


హెచ్‌ఎస్‌ఆర్‌పీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద నంబర్ ప్లేట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారికి ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగించడం వల్ల వాహనాలు గుర్తించడం కష్టమవుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఇది నేరాల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతకు సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇక వాహనదారులు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల(HSRP)కు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తు్న్నారు. నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లనే అమర్చుకోవాలని సూచిస్తున్నాు. రిజిస్ట్రేషన్ నంబరులో ఎలాంటి మార్పులు చేయవద్దని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడితే కేసులు నమోదు చేసి.. వాహనాలు సీజ్ చేయడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భూ వివాదాల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు

For More TG News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 05:18 PM