Share News

విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక వేధింపులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:27 AM

విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరరే ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించసాగాడు.. తట్టుకోలేని బాధితురాలు తోటి విద్యార్థులకు చెప్పడంతో వారు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక వేధింపులు

  • పోక్సో కేసు నమోదు..

  • ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఘటన

అమీన్‌పూర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరరే ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించసాగాడు.. తట్టుకోలేని బాధితురాలు తోటి విద్యార్థులకు చెప్పడంతో వారు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పటేల్‌గూడలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ ఘటన జరిగింది.


బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న మైనర్‌ విద్యార్థినిని ఇంగ్లిష్‌ లెక్చరర్‌ రవి(40) వేధిస్తున్నాడు. ఇటీవల వేధింపులు తీవ్రతరం కావడంతో సహచర విద్యార్థులకు విషయం చెప్పింది. సోమవారం వారంతా కలిసి తరగతి గదిలో ఉన్న లెక్చరర్‌ రవిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్

వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:27 AM