హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి విద్యుత్ సరఫరా బంద్
ABN , Publish Date - Jun 30 , 2026 | 07:12 AM
విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్, హైదరాబాద్-1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్, హైదరాబాద్-1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు. బతుకమ్మకుంట, సాయిబాబాటెంపుల్, అంజయ్యభవన్, రేణుకా ఎన్‌క్లేవ్ ప్రాంతాల పరిధిలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సీఈ కాలనీ పరిధిలో మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 గంటల వరకు కరెంటు ఉండదన్నారు. అదే విధంగా అహోబిలమఠం పరిధిలో మ.3:00 నుంచి 4:00 గంటల వరకు, రామాలయం పరిధిలో సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు, దోమలగూడ, మారుతినగర్, షాదాన్‌కాలేజీ పరిధిలో మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు.
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా సబ్‌స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా మంగళవారం సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ సీబీడీ రాజేందర్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉప్పుగూడ సాయిబాబానగర్, నీలం సెంటర్ ఫీడర్ పరిధిలో.. ఉప్పుగూడ, నరహరి నగర్, శివాజీనగర్, అంబికానగర్, పార్వతినగర్, కందికల్‌గేట్, అశోక్ నగర్, సాదిక్‌నగర్, నీలం సెంటర్, శివాజీనగర్, సాయిబాబానగర్ ప్రాంతాల్లో ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
షాజహాన్, డార్జిలింగ్ స్కూల్...
షాజహాన్ హోటల్, తలాబ్‌కట్ట, సుల్తాన్‌షాహీ, ఖుబా మసీదు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పల్లెల్లో 90 శాతం..నగరాల్లో 30 శాతం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News